News

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..?


ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరి కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ పార్లమెంట్ సభ్యులంతా హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం ఈ విషయం తెలిసిన పలువురు వెంకయ్యను అభినందిస్తున్నారు. సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన వెంకయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేత ఆజాద్, జేడీయూ నేత శరద్ పవర్, వామపక్ష నేతలు అభినందనలు తెలిపారు. వెంకయ్య అయితే రాజ్యసభను హుందాగా నడిపిస్తారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో సింహాన్ని చూడబోతున్నామని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.